మానవత్వం
మమతను పంచే మనసునే కాను, రక్తం తాగే గుండెను నేను. మంచిగ మసలే మోమునే కాను, మోసం దాగిన ముసుగును నేను. కడుపున కాసిన కాయనే కాను, కంఠం కొరికే కత్తిని నేను. నవ్వులు నింపే నారినే కాను, నయవంచన నక్కిన నీడను నేను. స-వసంత సంతస సంధ్యనే కాను, స్వార్ధ స్వరాలకు సాక్షిని నేను. ఆప్తుల అలకకు ఆమనినే కాను, ఆకలి ఆత్మల ఆధ్యం నేను. వాకిట వెన్నెల వాగునే కాను, వలపులు విరిసిన వుచ్చును నేను. మన్నన మోసే మగరాజునే కాను, మానం మాపే మృగరాజును సైతం నేనే. అశోక్ యన్.
2
0
ashok kumar
loner, skeptic, atheist.
Comments
Sign in or sign up to comment on this poem!
Poems by style
Poems by content